- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తికర విషయాలు!
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌ను రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓడించారు. ఈ ఎన్నికలో ట్రంప్ గెలిచి కొన్ని అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఈ ఎన్నికలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.
- రెండోసారి ఓడి మూడోసారి గెలిచిన అధ్యక్షుడిగా 132 ఏళ్ల రికార్డు బ్రేక్. 1892లో క్లీవ్‌లాండ్ ఇలాగే అధ్యక్షుడయ్యారు.
- 78 ఏళ్ల వయసుతో ఓల్డ్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ రికార్డు(అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సమయానికి 78 ఏళ్ల మీద 221 రోజులు, బైడెన్‌కు 78 ఏళ్ల 61 రోజులు)
- రెండు సార్లు మహిళా అభ్యర్థులను ఓడించి.. పురుష అభ్యర్థిపై ఓడిన ట్రంప్. 2016లో హిల్లరి క్లింటన్, 2024లో కమలా హ్యారిస్‌ను ఓడించారు. 2020లో బైడెన్ చేతిలో ఓడిపోయారు.
- పదవిలో ఉండగా రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తర్వాత రెండు కేసుల్లోనూ నిర్దోషిగా తేల్చిన సెనేట్.
- 20 ఏళ్లలో పాపులర్ ఓట్లనూ మెజార్టీ సాధించుకున్న రిపబ్లికన్ నాయకుడు.
- ఓ కేసులో దోషిగా తేలి.. అధ్యక్ష పదవి అలంకరించనున్న తొలి అధ్యక్షుడు
- ఇప్పటి వరకు మహిళను ప్రెసిడెంట్‌గా ఎన్నుకోని అమెరికా
- శ్వేతసౌధంలో తొలిసారి సెకండ్ లేడీ(ఉషా చిలుకూరి వ్యాన్స్)గా భారత సంతతి మహిళ
- అమెరికా పోల్స్ సర్వే అక్యూరసీ 60 శాతమే. ఈ సర్వేలు ఓటు షేర్‌ను అంచనా వేస్తాయి, కానీ, గెలుపును కాదు.
- ఫ్లోరిడా, ఒహాయో రాష్ట్రాలు ఇక స్వింగ్ స్టేట్లు కాదు.. రిపబ్లికన్ల సేఫ్ స్టేట్లుగా మార్పు