Donald Trump Cases: గెలుపు తర్వాత ట్రంప్‌పై ఉన్న క్రిమినల్ కేసుల సంగతేంటి?

by S Gopi |
Donald Trump Cases: గెలుపు తర్వాత ట్రంప్‌పై ఉన్న క్రిమినల్ కేసుల సంగతేంటి?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో, ఆయనపై ఉన్న తీవ్రస్థాయి క్రిమినల్ కేసులను ఎలా ఎదుర్కొంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే, ట్రంప్ అనేక కేసులతో పాటు ఓ కేసు వ్యవహారంలో అరెస్ట్ కూడా అయ్యారు. కోర్టు దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు 47వ అధ్యక్షుడిగా మళ్లీ ట్రంప్ గెలిచారు. ఓవల్ ఆఫీస్‌కు తిరిగి వెళ్లడం ట్రంప్‌నకు అధ్యక్షుడిగా అధికారాన్ని కల్పిస్తుంది. ఆ హోదాలో ఉన్నప్పుడు ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ పొందవచ్చు. కానీ, డొనాల్డ్ ట్రంప్ మరే మాజీ అధ్యక్షుడూ ఎదుర్కొనని అత్యంత తీవ్రమైన, చట్టపరమైన కేసులను ఎదుర్కొంటున్నారు. గతేడాది ట్రంప్ ఫెడరల్, స్టేట్ కోర్టులలో నాలుగు ప్రధాన కేసులను ఎదుర్కొన్నారు. అయితే ఆయన మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా గెలవడంతో కేసుల వ్యవహారం చాలావరకు ముందుకు సాగకపోవచ్చు. లేదా ఆయన తన పదవి నుంచి దిగేవరకు స్తబ్దుగా మారవచ్చని తెలుస్తోంది. హష్ మనీ కేసుకు సంబంధించి న్యూయార్క్ కోర్టు నవంబర్ 26న శిక్షను తేల్చనుంది. అధ్యక్షుడిగా ఖరారవడంతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ కేసు వ్యవహారంలో ట్రంప్ తరపు న్యాయవాదులు వాయిదా కోసం ప్రయత్నించవచ్చని సమాచారం. ట్రంప్ వచ్చే ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. ఈలోపు పరిణామాలు ఎలా మారుతాయనే అంశం చర్చనీయాంశమవుతోంది.

Advertisement

Next Story