- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కూరగాయల మార్కెట్లో తల్లి, పిల్లాడి ప్రవర్తనకు అంతా షాక్..!
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ బాలుడు కూరగాయల షాప్‌కు నిప్పు పెట్టిన ఘటన అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మరోవైపు ఆ పిల్లాడి తల్లి ప్రవర్తనను చూసి అందరూ షాక్ అయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన సీసీఫూటెజ్ వీడియో సోషల్‌మీడియాలో ఒకటి వైరల్‌గా మారింది. ఓ కూరగాయాల మార్కెట్లో తన అమ్మ వెంటన ఓ బాలుడు వస్తాడు. వాళ్ల అమ్మ ఇంకో బిడ్డను ఎత్తుకుని కూరగాయల మార్కెట్లో తిరుగుతున్నారు.
ఈ క్రమంలోనే అమ్మ వెనుకాల ఉన్న బాలుడు తన వెంట తెచ్చుకున్న లైటర్‌తో కూరగాయాలకు నిప్పుపెడుతాడు. అక్కడే ఉన్న పిల్లాడి తల్లి మాత్రం అది గమనించదు. తర్వాత మంట పెద్దగా అవ్వడంతో పిల్లవాడు తల్లి దగ్గరకు వస్తాడు. మంటలు పెద్దగా అయ్యేసరికి తల్లి గమనిస్తుంది. అలాగే చూస్తూ నిశబ్దంగా ఉండిపోతుంది. కానీ యజమానులకు మంటలు అంటుకుంటున్న విషయం చెప్పదు.
కానీ, మంటలు గమనించి అక్కడే చుట్టుపక్కన ఉన్న కొందరు కస్టమర్లు వెంటనే షాప్ యజమానులకు మంటలు అంటుకున్న చెబుతారు. మంటలు వ్యాప్తి చెందకుండా వెంటనే యజమాని నీళ్లతో మంటలను ఆర్పేస్తారు. కాగా, ఈ వ్యవహారమంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఇది చూసిన యజమానులు పిల్లాడు నిప్పంటించాడని తెలుసుకొని షాక్ అయ్యారు. మరోవైపు విడీయో నెట్టింట్లో వైరల్ అవ్వగా.. పిల్లాడి ప్రవర్తన, పిల్లాడి తల్లి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. తల్లి చూసి రమ్మంటే తను కాల్చి వచ్చాడని మరికొందరూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.