- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Minister Ponnam Prabhakar: కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక పిలుపునిచ్చారు. శనివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. కులగణన(Caste Census)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని తెలిపారు. దీనికి సంబంధించి శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని డీసీసీ కార్యాలయాల్లో జరుగుతున్న సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని సూచించారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణనను తెలంగాణ ప్రభుత్వం ఈనెల 6వ తేదీ నుండి చేపట్టబోతోందని స్పష్టం చేశారు.
కులగణన(Caste Census) సమయంలో పార్టీ నేతలంతా అధికారులకు సహకరిస్తూ భాగస్వామ్యం కావాలని కోరారు. అందుకోసం శనివారం అన్ని జిల్లాల్లో జరుగుతున్న డీసీసీ(DCC) సమావేశాల్లో పార్టీ నేతలంతా మమేకం కావాలని విజ్ఞప్తి చేశారు. డీసీసీ సమావేశంలో కులగణనపై చర్చించిన అంశాలను బూత్ లెవెల్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలియజెప్పి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాలని అన్నారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం నవంబర్ 30వ తేదీలోగా కులగణన పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.