Vemulawada : రాజన్న ఆలయంలో ప్రారంభమైన కార్తీక మాస వేడుకలు

by Aamani |
Vemulawada : రాజన్న ఆలయంలో ప్రారంభమైన కార్తీక మాస వేడుకలు
X

దిశ, వేములవాడ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసం వేడుకలకు ముస్తాబైంది. నేటి నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించే ఈ వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా, విద్యుత్ దీపాలతో, రంగు రంగుల పూల అలంకరణతో తీర్చిదిద్దారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు ఆలయంలో ప్రతి రోజూ సామూహిక కార్తీక దీపోత్సవం తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.

వేడుకల నిర్వహణకు సంబంధించి భక్తి భావం ఉట్టిపడేలా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాటు చేసినట్లు ఈఓ స్పష్టం చేశారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కొనసాగే ఈ వేడుకల్లో భక్తులు, కళాకారులు అధిక సంఖ్యలో సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఇదిలా ఉండగా కార్తీక మాసం ప్రారంభమవడం తో ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. ఆలయానికి వచ్చిన భక్తులు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రాకతో ఇన్ని రోజులు బోసిబోయిన ఆలయ పరిసరాల్లో ఒక్కసారిగా సందడి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed