Harish Rao : ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా ప్రజా పాలన! ఎక్స్‌లో హరీశ్ రావు డిమాండ్ ఇదే

by Ramesh N |
Harish Rao : ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా ప్రజా పాలన! ఎక్స్‌లో హరీశ్ రావు డిమాండ్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు Harish Rao పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. పేదల ఇండ్లు ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించినందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అని ఆరోపించారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా ప్రజా పాలన అంటే.. BRS బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదన్నారు.

ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. మా నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ డీజీపి, సీఎంవో ఖాతాలకు ఎక్స్‌లో ట్యాగ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed