Trending: వరద సహాయక చర్యల్లో వీరోచితంగా పోలీసుల డ్యూటీ.. శభాష్ అంటున్న సామాన్య జనం

by Shiva |   ( Updated:2024-09-04 14:51:54.0  )
Trending: వరద సహాయక చర్యల్లో వీరోచితంగా పోలీసుల డ్యూటీ.. శభాష్ అంటున్న సామాన్య జనం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పోలీసులంటేనే జనాలకు ఓ చిన్నచూపు. ఏదైనా సాయం కావాలని పోలీస్ స్టేషన్లకు వెళితే.. సవాలక్ష ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెడుతుంటారాని చాలామంది బహిరంగంగానే పోలీసులను విమర్శిస్తుంటారు. మరోవైపు వాళ్ల పేరు వినపడగానే గొడవలు, భూ పంచాయతీల్లో సెటిల్‌మెంట్లు చేసి డబ్బులు డిమాండ్ చేస్తారని సామన్యులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. కానీ, అందరూ పోలీసులు ఒకేలా ఉండరని నిరూపించారు ఏపీలోని కొందరు పోలీసులు. ఇచ్చిన బాధ్యతను మరువకుండా.. సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా అంకితభావంతో పనిచేస్తూ.. ప్రజల చేత నిఖారైన కాప్స్ అనిపించుకుంటున్నారు కొందరు. తాజాగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో అక్కడి పోలీసులు సహాయక చర్యల్లో నిరంతరం పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ వరదల్లో చిక్కుకుపోయిన అభాగ్యులను క్షేమంగా బయటకు తీసుకొస్తున్నారు. అయితే, తాజాగా విజయవాడ ప్టణంలోని ఓ ప్రాంతంలో వరదల్లో చిక్కుకుపోయిన ఇద్దరు చిన్నారులను ఓ పోలీసు తమ భుజాలపై బయటకు తీసుకొస్తున్న వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ‘కొంతమంది పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి పోలీసులు కూడా విమర్శలు ఎదరుర్కొంటున్నారు. సెల్యూట్ పోలీస్ సార్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story