ఇదేం బైక్‌రా బాబు? రంపం టైర్ల స్పోర్ట్స్ బైక్! దూసుకుపోవడమే కాదు..

by Ramesh N |   ( Updated:2024-03-16 06:30:14.0  )
ఇదేం బైక్‌రా బాబు? రంపం టైర్ల స్పోర్ట్స్ బైక్!  దూసుకుపోవడమే కాదు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా టూ వీలర్ బైక్‌లకు ట్యూబ్ ఉన్నవి, ట్యూబ్ లెస్ టైర్లు చుస్తుంటాము. మరోవైపు టైర్లు పూర్తిగా చెక్క, ఇనుముతో చేయబడిన విచిత్ర టైర్లు చూశాము. కానీ అందుకు భిన్నంగా ఓ టూ వీలర్ స్పోర్ట్స్ బైక్‌కు రంపం (బ్లేడ్)తో చక్రాల మాదిరి అమర్చి నడుపుతున్నారు. అవును మీరు విన్నది నిజమే రంపం టైర్ల స్పోర్ట్స్ బైక్‌పై ఓ యువకుడు దూసుకుపోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మంచు ప్రదేశాల్లో రెగ్యులర్ టైర్లు ఉన్న బైక్స్ వెళ్లాలంటే కొంత శ్రమతో కూడుకున్న పని, ఆ టైర్లు ముందుకు కదలదు, దీంతో ఆ టైర్లు మంచుపై జారిపోయి కింద పడ్డ ఘటనలు మనం ఎన్నో చూశాం. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడికి వినూత్న తీరులో ఓ ఆలోచన వచ్చింది. స్పోర్ట్స్ బైక్‌కు ఉన్న రెగ్యులర్ టైర్లను తీసేసి రంపం టైర్లు అమర్చాడు. అనంతరం ఆ బైక్‌తో మంచులో స్పీడ్‌గా రైడ్ చేస్తున్నాడు. మరోవైపు మట్టిపై కూడా ఈ బైక్ రైడ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఆ బైక్‌ టైర్లతో పెద్ద పెద్ద చెట్ల మొద్దులను కూడా కట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రంపం టైర్ల స్పోర్ట్స్ బైక్ అని నెటిజన్లు ఆ బైక్‌కు పేరు పెట్టేశారు. అయితే కొంచెం ఏదైనా తేడా వస్తే మాత్రం ఆ రంపం టైర్ల కింద పడి నలిగి పోవాల్సిందేనని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story