- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
video viral:‘రమ్మంటే రాదా మరి’.. పర్యాటకులపై చిరుత దాడి
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్(Video Viral) అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియా(Social Media) అందుబాటులోకి వచ్చాక వింతలు, విశేషాలు కొదువే లేకుండా పోయింది. కొన్ని సార్లు షాకింగ్ ఘటనలు(Shocking Incident) కూడా వెలుగుచూస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఫ్రీ టైమ్(Free Time) దొరికితే ఎక్కడికైనా టూరిస్ట్ ప్రదేశాలకు(Tourist Place) వెళ్తుంటారు. ఇక అక్కడ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా గడుపుతారు. అంతేకాదు ఆ ప్రదేశంలో ఉన్న జంతువులను(Animal) ఫొటోలు(Photos) తీస్తూ వాటితో సరదాగా, ఆటపట్టిస్తూ ఉంటారు.
తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని షోడోలో అటవీ ప్రాంతంలోకి కొందరు వ్యక్తులు విహార యాత్రకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడి సుందరమైన ప్రకృతిని తమ కెమెరాల్లో(Camera) బంధిస్తున్నారు. ఈ క్రమంలోనే దూరం నుంచి పొదల్లో ఉన్న చిరుత పులిని చూశారు. ఆ చిరుతను పర్యాటకులు ఆటపట్టించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పొదల్లో నుంచి నక్కి చూస్తున్న చిరుతను రమ్మని పిలిస్తే అది ఊరుకుంటుందా? వారికి చిరుత కనిపించడంతో ‘ఆజా ఆజా’ అని పిలవడంతో పరుగులు తీసిన చిరుతకు చిక్కారు. దీంతో ముగ్గురి పై చిరుత దాడి చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Leopard attack in Shahdol range of Madhya Pradesh pic.twitter.com/iXYnxnkXSD
— Dilshad (@dilshad_akhtar1) October 21, 2024