‘మహిళల బట్టలు పురుషులు కుట్టకూడదు’.. మహిళా కమిషన్ కీలక ప్రతిపాదన

by Jakkula Mamatha |   ( Updated:2024-11-08 11:06:44.0  )
‘మహిళల బట్టలు పురుషులు కుట్టకూడదు’.. మహిళా కమిషన్ కీలక ప్రతిపాదన
X

దిశ,వెబ్‌డెస్క్: బ్యాడ్ టచ్(Bad touch) నుంచి స్త్రీలకు రక్షణ కల్పించేందుకు యూపీ మహిళా కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సెలూన్, టైలర్స్.. తదితర మహిళలకు సేవలందించే షాపుల్లో మహిళా సిబ్బందే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. యోగా(Yoga), డాన్స్(dance), జిమ్ సెంటర్‌(gym center)లలో సీసీ కెమెరా తప్పనిసరిగా ఉండాలని సూచించింది. అసలు విషయంలోకి వెళితే.. మహిళల బట్టలను పురుషులు కుట్టకుండా నిరోధించాలని ఉత్తర్ ప్రదేశ్ మహిళా కమిషన్ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇది బ్యాడ్ టచ్(Bad touch) కిందకే వస్తుందని యూపీ మహిళా కమిషన్(UP Commission for Women) తేల్చి చెప్పింది. స్త్రీల దుస్తుల కొలతలు స్త్రీలు మాత్రమే తీసుకోవాలని, టైలరింగ్ షాపు(Tailoring shop)ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మహిళల శిరోజాలను పురుషులు కత్తిరించకుండా, స్త్రీలే కత్తిరించేలా చర్యలు తీసుకోవాలని యూపీ ప్రభుత్వానికి(UP Government) ప్రతిపాదించింది. అక్టోబరు 28న జరిగిన మహిళా కమిషన్‌ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. బ్యాడ్ టచ్ నుంచి మహిళలను రక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed