Live Worms in Pizza : పిజ్జాలో బతికున్న పురుగులు.. కంగుతిన్న కస్టమర్! ఎక్కడంటే?

by Ramesh N |
Live Worms in Pizza : పిజ్జాలో బతికున్న పురుగులు.. కంగుతిన్న కస్టమర్! ఎక్కడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ అనేది జోక్ అయిపోందని ఆరోపణలు వస్తున్నాయి. బయట హోటళ్లలో దొరికే ఫుడ్ తినాలంటే కొంతమంది జంకుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ పలు హోటళ్లు, రెస్టారెంట్ల తీరు మారడం లేదు. హోటల్ పరిశుభ్రత, ఎలుకలు తిరగడం, నాణ్యత లేని ఆహారం, ఫుడ్‌లో బొద్దింకలు రావడం చూసే ఉంటారు.

తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ హోటల్‌లో ఆర్డర్ చేసిన పిజ్జాలో బతికున్న పురుగులు కనిపించడంతో కస్టమర్ కంగు తిన్నాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వేశాడు. ఇది మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనగా సమాజిక మాధ్యమాల్లో వీడియో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. పిజ్జాతో పాటు అదనంగా స్పెషల్ ప్రోటీన్ కూడా ఇచ్చారని మరికొందరూ ఫన్నీ కామెంట్లు పెట్టారు.

Advertisement

Next Story