- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Instagram: తల్లీ, కొడుకు అసభ్యకర వీడియో వైరల్.. ఇన్‌స్టాగ్రామ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు
దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టాగ్రామ్.. దేశంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుతున్న ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం. ఇందులో ముఖ్యంగా రీల్స్ చేస్తూ.. కుర్రకారు కొత్తపుంతలు తొక్కుతోంది. అభ్యకరమైన వీడియోలు, జుగుప్సాకరమైన కంటెంట్ మానవ సంబంధాలను సైతం మలినం చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ తల్లీ, కొడుకు చేసిన అడల్ట్ కంటెంట్‌కు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌పై పోక్సో, ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఆదేశాల మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. అనంతరం అమెరికాలోని మెటా కార్యాలయానికి సైతం లీగల్ నోటీసులు పంపారు. అయితే, ఆ వీడియోలో ఓ తల్లీ, కొడుకు ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారు. కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవ్వడంతో స్పందించిన జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దీనాజ్‌పూర్ నుంచి ఆ వీడియో అప్‌లోడ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా వీడియో ప్రమోట్ చేసిన యూట్యూబ్‌పై కూడా మహారాష్ట్రలో కేసు నమోదు కావడం విశేషం.