- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కంటతడి పెట్టిస్తోన్న తండ్రి కూతుళ్ల వీడియో.. 5 నెలల చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
దిశ, ఫీచర్స్: తండ్రికూతుళ్ల బంధం గురించి ఎంత వివరించిన తక్కువే. బిడ్డ పుట్టినప్పటి నుంచి తండ్రి ఎంతో గారాబంగా పెంచుతూ.. గుండెలపై మోస్తాడు. ఏ సమయంలోనైనా నేనున్నానని భరోసా ఇస్తాడు. జీవితంలో ఎన్నిసార్లు విఫలమైనా నువ్వు చేయగలవు అని మద్ధతు ఇస్తాడు. ప్రతి అమ్మాయి తన తండ్రి లాంటి వాడు భర్తగా రావాలని కోరుకుంటాడు. ఎందుకంటే తండ్రిని మించి ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించలేరు.
అయితే తాజాగా ఓ తండ్రి కూతురు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనాలు ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీడియోలో తండ్రి దాదాపు 5 నెలలున్న తన కుమార్తెతో లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. డోర్ దగ్గర కుమార్తెను పట్టుకుని కూర్చున్నాడు. ఈ క్రమంలో కూతురు తన నాన్నకు ప్రేమగా ఏదో తినిపిస్తుంది.
తన బుజ్జి బుజ్జి చేతులతో తండ్రి నోట్లో పెడుతుండగా.. తండ్రి కూడా ఎంతో ప్రేమగా తింటాడు. మళ్లీ చిన్నారికి తినిపించడానికి ప్రయత్నిస్తాడు. ఈ వీడియోలో తండ్రి కూతుళ్ల ప్రేమ చూసి జనాల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఎమోషనల్ అవుతూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హృదయానికి హత్తుకునే ఈ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించగా.. వందల మంది లైక్ చేశారు.