సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొన్నం

by Aamani |
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొన్నం
X

దిశ,కంటోన్మెంట్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ , హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి సిఖ్ విలేజ్ లో ధోబి ఘాట్ గ్రౌండ్ ను స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేయడానికి స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. చాలా కాలంగా కంటోన్మెంట్ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని డిఫెన్స్, రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని ఎలివేటర్ కారిడార్ పై వేగవంతంగా అడుగులు ముందుకు వేసిందని మంత్రి పొన్నం అన్నారు. ఇక్కడి ఏరియా పైన పార్లమెంటు సభ్యుడుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కి పూర్తి అవగాహన ఉందని అన్నారు.ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధికి గణేష్ మంచి పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ ఆదిలాబాద్ సిద్దిపేట ప్రాంత ప్రజలకు ఊరు నుండి హైదరాబాద్ రావడానికి ఎంత టైం పడుతుందో అలాగే అల్వాల్ నుంచి అంత టైం పడుతుందని అన్నారు.

ఇప్పటికే ఎలివేటర్ కారిడార్ కు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ మహానగరం దిన దినాభివృద్ధి చెందుతున్న తరుణంలో మారెడ్ పల్లి వరకు మెట్రో అనుసంధానం పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ఎలివేటర్ కారిడార్ లో భాగంగా రోడ్డు ,హైవే ,మెట్రో ఒకేసారి నిర్మాణం ఉంటుందని అన్నారు. మారేడు పల్లి నుండి అల్వాల్ వరకు ఎలివేటర్ కారిడార్ తో మెట్రో లింక్ అయి ఉంటే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని తెలిపారు. రవాణా పరంగా ఎలివేటర్ కారిడార్ ఉపయోగపడుతుందని, స్థల సేకరణ లో భాగంగా స్థలం బదులు నిధులు సెంట్రల్ లో వేస్తే ఏం ప్రయోజనం ఉండదని అన్నారు.

ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ఆ నిధులను కంటోన్మెంట్ అభివృద్ధికి ఉపయోగించేలా చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ,రోడ్లు ఇతర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు ఈ గ్రౌండ్ లో ఫుట్ బాల్ ఆటగాళ్ళు ఎంతోమంది వచ్చారని గుర్తు చేశారు. ఈ గ్రౌండ్ ను స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభివృద్ధి చేస్తామని అన్నారు.ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతుందని తెలిపారు. సికింద్రాబాద్ లో ఈ గ్రౌండ్ క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా మరింత అభివృద్ధి చేస్తామని అలాగే కంటోన్మెంట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము కూడా తెలంగాణ లోనే ఉన్నాం అనే విధంగా మా అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు.

ఎవరికైనా 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ రాకపోతే సంబంధిత అధికారికి విజ్ఞాపన చేయాలని, కంటోన్మెంట్ ఏరియా లో కూడా తిరుమలగిరిలో కార్యాలయ పెట్టినామని తెలిపారు.నెహ్రూ జయంతి సందర్భంగా తెలంగాణ భవిష్యత్, ఆస్తి అయినటువంటి విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసామన్నారు.ప్రజా పాలన ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షిక ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఈటల రాజేందర్ కి విజ్ఞప్తి,అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజకీయాలు వద్దు. ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని చూడాలని, ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

గచ్చిబౌలి లో ఉన్న అభివృద్ధి ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా లో లేదని అభివృద్ధి జరుగుతుంది దానిని అడ్డుకోవద్దు అన్నారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డు ల పైలెట్ ప్రాజెక్టు ప్రాసెస్ నడుస్తుందని,గత పాలకులు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో బ్యాంక్ అకౌంట్ అడగడం లేదన్నారు. బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతున్నామన్నారు. కులం అవసరం లేదు చెప్పం అనుకుంటే 999 ఆప్షన్ ఉందని,ఈ సర్వే ఎవరికి వ్యతిరేకం కాదని,సర్వే జీవో నెంబర్ 10 ద్వారా ప్రభుత్వం సేకరిస్తుందని,ఎవరైనా ఎన్యుమరేటర్ ను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇప్పటికీ 30 శాతం సర్వే పూర్తయిందని అన్నారు.భవిష్యత్ లో ఈ వర్గాలకు న్యాయం జరగాలని గొప్ప ప్రణాళిక తో ముందుకు పోతున్నామని పేర్కొన్నారు.ఫిబ్రవరి 4 కేబినెట్ నిర్ణయం తీసుకొని 16 న అసెంబ్లీలో తీర్మానం చేశామని తెలిపారు.

గతంలో కుల గణన సర్వే కు నిరసన చేసిన వారు ఇప్పుడు ఎక్కడ చేయడం లేదని, సర్వే కు స్వాగతిస్తున్నారన్నారు.సర్వే ద్వారా సామాజిక రుగ్మతలు తొలగించవచ్చునని అన్నారు.చట్టాన్ని చేతిలో తీసుకుంటే చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్నారు.సర్వే ద్వారా ఎలాంటి అపోహలు పడవద్దు అన్నారు.రాజకీయ కుట్ర చేసేవారు ఇలాంటి అపోహలు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. సర్వే వల్ల ఏ పథకం కట్ కాదు..కొత్త పథకాలు వస్తాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story