బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఆలయాల అభివృద్ధి : పైలెట్

by Kalyani |
బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఆలయాల అభివృద్ధి : పైలెట్
X

దిశ, తాండూరు : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం యాలాల మండలం దౌలాపూర్ గ్రామంలో రక్త మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై, ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.ఆలయ నిర్వాహకులు రోహిత్ రెడ్డికి సన్మానించారు.అనంతరం పైలెట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం పలు రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కేసీఆర్‌ ప్రజల్లో దేవుడిలాగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రాజు గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి. తాండూరు, బషీరాబాద్ మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు వడ్డే రాములు, వెంకట్ రెడ్డి, శివా, ఆర్వీంద్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రఘు, పాండురంగ రెడ్డి, రాములు, లాలు యూత్ ప్రెసిడెంట్ విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed