- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరెస్ట్‌కు కేటీఆర్ ఆరాటం.. సీఎం పదవి కోసమేనా..?
దిశ, వెబ్‌డెస్క్ : అన్ని కేసులు అన్ని దిక్కులనుంచి కమ్ముకుంటున్నవేళ నేనంటే నేనని కారుపార్టీ నాయకులూ జైలుకి వెళ్లటానికి తహతహలాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ చిన్న సారు పేరు ప్రతికేసులో మారుమోగుతోంది. ఫోన్ టాపింగ్, లగచర్ల, ఈ- కారు రేసింగ్, డ్రగ్స్ అన్ని కేసుల్లో ఒకటే పేరు కేటీఆర్.. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులూ జైలుకి వెళ్తుంటే ఇంకా ముఖ్య నాయకుడు కేటీఆర్ కూడా జైలుకి వెళ్లే అవకాశాలు మస్తుగా కనిపిస్తున్నాయి. ఇదే విషయంలో కేటీఆర్ కూడా జైలుకి వెళ్ళడానికి చాలా ఆసక్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే అని మాట్లాడుతున్నాడు. ఒకవైపు కేటీఆర్ మరోవైపు హరీష్ రావు నేనంటే నేనని జైలుకి వెళ్ళడానికి హడావిడి చేస్తున్నారు. మరి అంతగా ఊసలు లెక్కపెట్టడానికి రెడీగా ఉన్న ఇద్దరు సార్లు ఎం ఆలోచిస్తున్నారో, దీనివెనుక కూడా ఏదైనా రాజకీయ తెలివితేటలూ ఉపయోగిస్తున్నారా అనే ఆలోచనలు అందరిలో మెదులుతున్నాయి.