Bopanna - Ebden : విడిపోతున్నట్లు బోపన్న-ఎబ్డెన్ జోడీ అనౌన్స్.. 2 ఏళ్ల ప్రస్థానానికి పుల్‌స్టాప్

by Sathputhe Rajesh |   ( Updated:2024-11-15 12:27:13.0  )
Bopanna - Ebden :  విడిపోతున్నట్లు బోపన్న-ఎబ్డెన్ జోడీ అనౌన్స్.. 2 ఏళ్ల ప్రస్థానానికి పుల్‌స్టాప్
X

దిశ, స్పోర్ట్స్ : మాజీ వరల్డ్ నెం.1 బోపన్న-ఎబ్డెన్‌ల జోడీ 2 ఏళ్ల తమ క్రీడా ప్రస్థానానికి ముగింపు పలకనున్నారు. టురిన్‌లో శుక్రవారం ఆడే ఏటీపీ టూర్ ఫైనల్ గేమ్ తమ ఇద్దరికి చివరిదని ప్రకటించారు. చివరి గేమ్‌లో ఈ జోడీ జర్మనీకి చెందిన కెవిన్ క్రవిట్జ్, టిమ్ ఫుట్జ్‌లతో తలపడనుంది. 2024ను ఆస్ట్రేలియా ఓపెన్ విజయంతో ఈ జోడీ ప్రారంభించింది. తద్వారా నెం.1 స్థానాన్ని చేరుకుంది. 44 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా బోపన్న చరిత్ర సృష్టించాడు. ఈ ద్వయం మియామి ఓపెన్‌ను గెలుచుకోవడంతో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్‌కు చేరింది. ఇదే అంశంపై బోపన్న స్పందిస్తూ.. ‘ఇది ఎత్తుపల్లాల ప్రయాణం. మూడు నెలలు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చాం. తర్వాత ఆటపరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం.’ అన్నాడు. ఏటీపీ టూర్ ఫైనల్‌ను అద్భుతంగా ముగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎబ్డెన్ మాట్లాడుతూ.. ‘మేము అద్భుతాలను సాధించాం. జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాం. అనంతరం మియామిలో అదే ప్రదర్శన కొనసాగించాం. ర్యాంకుల్లో నెం.1 జోడీగా నిలిచాం. మేము ఎంచుకున్న పెద్ద లక్ష్యాలను సాధించాం. టురిన్‌లో బిగ్ టైటిల్ గెలిచి తమ ప్రయాణాన్ని ముగించాలని అనుకున్నాం.’ అన్నాడు. 2025లో కొత్త ఆటగాడిని జోడీకి ఎంపిక చేసుకోనున్నట్లు బోపన్న స్పష్టం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed