Raging : మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..10మంది సీనియర్ల సస్పెన్షన్

by Y. Venkata Narasimha Reddy |
Raging : మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..10మంది సీనియర్ల సస్పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్ : మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీ(Mahbub Nagar Medical College)లో ర్యాగింగ్(Raging) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జూనియర్ వైద్యవిద్యార్థులను ర్యాగింగ్ చేసిన 10మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్(Suspension)చేయడంతో మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటన బహిర్గతమైంది. ఈనెల 10న కొందరు ఫ్రెష‌ర్స్ విద్యార్థులను రాత్రివేళ పలువురు సీనియ‌ర్లు ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన బాధిత విద్యార్థులు కాలేజీ డైరక్టర్ కు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ విచారణలో కీలకంగా ఉపయోగపడింది. కాలేజీ డైరెక్టర్ 13న వారికి కౌన్సిలింగ్ చేశారు. క్రమశిక్షణ చర్య కింద ర్యాగింగ్ కు పాల్పడిన 2023 బ్యాచ్‌ రెండో సంవత్సరంకు చెందిన 10మంది సీనియర్లను డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు సస్పెండ్ చేశారు.

కాలేజీలో ర్యాగింగ్ చేసినా, మిస్‌ బిహేవ్ చేసినా త‌నకు నేరుగా ఫిర్యాదు చేయాల‌ని డైరక్టర్ ర‌మేష్‌ విద్యార్థులకు సూచించారు. కాలేజీలో ర్యాగింగ్‌ పునరావృతం కాకుండా కఠినంగా హెచ్చరించామని, కమిటీ వేసి రాత్రి సమయంలో నిఘా పెంచినట్లు డైరెక్టర్‌ తెలిపారు. కాగా గతేడాది కూడా ఈ కాలేజీలో ర్యాగింగ్ ఆరోప‌ణ‌లు వెలుగుచూశాయి. కాలేజీలో మరోసారి ర్యాగింగ్ ఘటన జరుగడంతో ఈ సమస్యపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed