కేటీఆర్​ రాజకీయ క్రీడను తెలంగాణ సమాజం సహించదు

by Sridhar Babu |
కేటీఆర్​ రాజకీయ క్రీడను తెలంగాణ సమాజం సహించదు
X

దిశ, కూకట్​పల్లి : కేటీఆర్ ఆడుతున్న రాకీయ క్రీడను తెలంగాణ సమాజం సహించబోదని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు. శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సత్యం మాట్లాడుతూ కేటీఆర్​ ఆడుతున్న రాజకీయ క్రీడను తెలంగాణ సమాజం సహించబోదని అన్నారు. లగచర్లలో జరిగిన దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్​ అని, చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో నికృష్టమైన రాజకీయ క్రీడకు కేటీఆర్ తెర తీశారని, అధికారం పోయిందనే అక్కసుతో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.

తెలంగాణ రైతాంగం ఓట్లు వేయలేదని వారిమీద కక్షకట్టి కేటీఆర్ రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ద్వారా కేటీఆర్ లగచర్ల కుట్ర చేశారని ఆరోపించారు. మల్లన్నసాగర్ కోసం గత ప్రభుత్వం 12 గ్రామాల ప్రజలను బెదిరించి, దౌర్జన్యం చేసి భూసేకరణ చేసిందని, పదేళ్లు రాష్టంలో అప్రకటిత ఎమర్జెన్సీని బీఆర్ఎస్ అమలు చేసిందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలు ఒక్కరితో అయినా మాట్లాడారా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్​ను నమ్మడం లేదని అన్నారు.

అభివృద్ధిని అడ్డుకోవడానికి నీచమైన కుట్రలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. దళిత, గిరిజన, బీసీ బిడ్డల జీవితాలలో వెలుగులు నింపడానికి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం కొడంగల్​లో భూ సేకరణ జరుపుతుందని అన్నారు. కాలుష్య రహిత ఫార్మా విలేజ్​ని తీసుకురావడం ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. తెలంగాణకు పరిశ్రమలు వస్తే ప్రభుత్వానికి, కాంగ్రెస్​ పార్టీకి మంచి పేరు వస్తుందనే కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story