Chandrababu Nayudu : ముగిసిన సీఎం చంద్రబాబు, నిర్మలాసీతారామన్ భేటీ

by M.Rajitha |
Chandrababu Nayudu : ముగిసిన సీఎం చంద్రబాబు, నిర్మలాసీతారామన్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Nayudu) పలువురు కేంద్ర మంత్రులతో ప్రత్యేక సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా మొదట చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(NirmalaSitharaman) తో భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి ప్రపంచబ్యాంక్, ఏడీబీ ఇస్తున్న రూ.15 వేల కోట్ల రుణం విడుదల, తదితర అంశాలపై చంద్రబాబు ఆర్థిక మంత్రితో చర్చించారు. దీనిపై నిర్మలాసీతారామన్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ సమావేశం ముగిశాక విదేశాంగశాఖ మంత్రి జై శంకర్(Jai Shanker) తో చంద్రబాబు సమావేశం అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed