- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP: కాంగ్రెస్ పాలనలో విద్యార్థులపై పెరిగిన దాడులు.. ఎమ్మెల్యే పాయల్ శంకర్
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పాలన(Congress Rule)లో విద్యార్థులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే(Adilabad BJP MLA) పాయల్ శంకర్( Payal Shankar) అన్నారు. బాసర ఘటన(Basara Incident)పై స్పందించిన ఆయన ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా.. బాసరలో త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై న్యాయవిచారణ జరగాలని కోరుతూ ఏబీవీపీ విద్యార్ధి సంఘాల నాయకులు(ABVP Student Union leaders), విద్యార్థులు(Students) కాలేజీ వద్దకు వెళ్లారని తెలిపారు.
ఓ పోలీస్ అధికారి కాలేజీ ప్రైవేట్ సెక్యూరిటీతో కలిసి విద్యార్థులపై దాడి చేయడమే గాక దారుణంగా చిత్రహింసలకు గురి చేసినట్లు వీడియోల్లో కనిపించిందన్నారు. దీనిపై రాష్ట్ర డీజీపీ(Telangana DGP) సమాధానం చెప్పాలన్నారు. అంతేగాక విద్యార్థి ఆత్మహత్యపై సమాధానం చెప్పలేకపోతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ దుస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలని చెప్పారు. ఇక విద్యార్థులపై దాడి చేయడం విచారకరమని, దాడికి పాల్పడ్డ సీఐని సస్పెండ్ చేయాలని కోరారు. అలాగే ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని బీజేపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.