Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-15 14:35:02.0  )
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: అయ్యప్ప భక్తులు(Ayyappa Devotees) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న శబరిమల(Sabarimala) అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం అధికారులు దర్శనాలు ప్రారంభించారు. మకరవిళక్కు సీజన్(Makaravilakku season) కోసం ఇవాళ ఆలయాన్ని ఓపెన్ చేయగా.. భక్తులు పోటెత్తారు. తొలిరోజే దర్శనం కోసం 30 వేల మంది వర్చువల్ బుకింగ్ చేసుకున్నారు. మణికంఠుడి దర్శనానికి 18 గంటల వరకు సమయం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు దేవస్థానం బోర్డు ప్రకటించించింది. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రోజూ ఉదయం వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ మార్పుల ద్వారా భక్తులకు 17 గంటల సుదీర్ఘ సమయం దర్శనానికి లభిస్తుందని అన్నారు. ప్రతిరోజూ 80 వేల మంది యాత్రికులకు దర్శనం అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed