- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hijab : హిజాబ్ ధరించకుంటే ‘ట్రీట్‌మెంట్’.. ఇరాన్ సంచలన నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో : మహిళలు ‘హిజాబ్’(hijab) ధరించడాన్ని తప్పనిసరి చేసే దిశగా ఇరాన్(Iran) మరో నిరంకుశ నిర్ణయం తీసుకుంది. హిజాబ్ ధరించని మహిళలకు కౌన్సెలింగ్ చేసేందుకు ‘హిజాబ్ రిమూవల్ ట్రీట్‌మెంట్ క్లినిక్’లను ఏర్పాటు చేయాలని ఇరాన్ మహిళా, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీనిపై ఆ మంత్రిత్వ శాఖ అధిపతి మెహ్రీ తలేబీ దరేస్తానీ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘మహిళలు హిజాబ్ ధరించకపోవడం ఒక వ్యాధి. దీన్ని తొలగించడానికి క్లినిక్‌ల ద్వారా శాస్త్రీయ, మానసిక చికిత్సను అందిస్తాం. హిజాబ్ ప్రాముఖ్యతను వారికి అర్థమయ్యేలా వివరిస్తాం’’ అని ఆమె వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఇరాన్‌లోని మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ‘‘హిజాబ్ ధరించడానికి నిరాకరించే మహిళలకు కౌన్సెలింగ్ చేయాలనే అంశం ఇస్లామిక్ చట్టాల్లో కానీ, ఇరాన్ చట్టాల్లో కానీ లేదు’’ అని ఇరాన్ న్యాయవాది హోస్సేన్ రైసీ విమర్శించారు. ‘‘హిజాబ్ ధరించని మహిళలను మానసిక రోగులుగా చిత్రీకరించడం, హింసించడం, బలవంతంగా చికిత్స చేయడం సరికాదు’’ అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా పలు మానవ హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి.
నవంబరు మొదటివారంలో..
నవంబరు మొదటివారంలో ఇరాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని అహౌ దర్యాయై హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ అర్ధ నగ్నంగా క్యాంపస్‌లో తిరిగింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మానసిక సమస్యలు ఉన్నాయని గుర్తించి.. ఆమెను మానసిక వైద్యశాలకు తరలించారు. 2022 సెప్టెంబరులో హిజాబ్‌ను వ్యతిరేకించిన మహ్సా అమిని అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆమె పోలీస్ కస్టడీలో చనిపోయింది.