- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kishan Reddy: చావడానికైనా సిద్ధం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం(Maharashtra election campaign)లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేశామని చెబుతూ ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్(KCR) తరహాలోనే రేవంత్ పాలన కూడా సాగుతోందని.. అవే అబద్ధాలు, అరాచకాలు అని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. బోనస్ అని.. బోగస్ మాటలు చెప్పి కాంగ్రెస్(Congress) గెలిచిందని విమర్శించారు. ఎంఐఎం(MIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుల డైరెక్షన్‌లోనే రాష్ట్రంలో పోలీసు నియామకాలు(Police Recruitment), బదిలీలు జరుగుతున్నాయని అన్నారు.
కాంగ్రెస్ చర్యల వల్లే వికారాబాద్‌లో కలెక్టర్(Vikarabad Collector)పై దాడి జరిగిందని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడుతోందని అన్నారు. కాంగ్రెస్‌కు ఏకైక ఏటీఎమ్‌గా తెలంగాణ మారిందని కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ పునరుజ్జీవనానికి ప్రతిపక్షాలు అడ్డొస్తున్నాయని సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆరోపిస్తున్నారు. అసలు మూసీ పునరుజ్జీవనానికి బీజేపీ(BJP) వ్యతిరేకం కాదని కీలక ప్రకటన చేశారు. మూసీ అభివృద్ధి కార్యచరణ, డీపీఆర్(DPR) లేదని అన్నారు. హైదరాబాద్‌లో ఇళ్లు కూలుస్తూ.. నల్లగొండలో రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో పేదల ఇళ్లు కూల్చొద్దు అంటే.. బుల్డోజర్లతో తొక్కిస్తానని సీఎం రేవంత్ అంటున్నారు. పేదల కోసం చావడానికైనా సిద్ధమని కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం.. రేపు పేదల ఇళ్లలో మూసీ పక్కనే నిద్రిస్తామని అన్నారు. పేదల ఇళ్లు కూల్చకుండా ప్రక్షాళన చేస్తే తప్పకుండా మద్దతిస్తామని తెలిపారు. కేటీఆర్‌ను అరెస్ట్ కాకుండా బీజేపీ అడ్డుకుంటుందనేది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు.