Giri Pradakshina: అన్నవ‌రంలో ప్రారంభ‌మైన గిరి ప్రదక్షిణ

by Rani Yarlagadda |
Giri Pradakshina: అన్నవ‌రంలో ప్రారంభ‌మైన గిరి ప్రదక్షిణ
X

దిశ, వెబ్ డెస్క్: కార్తీక పౌర్ణమి (Karthika Pournami) సందర్భంగా అన్నవరంలో నేడు గిరి ప్రదక్షిణ (Giri Pradakshina) ప్రారంభమైంది. రత్న, సత్యగిరుల చుట్టూ 8.4 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ జరుగుతోంది. కొండ దిగువన సత్యరథానికి పూజలు చేసి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు పండితులు. తొలుత వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ జరిగే దారి పొడవునా భక్తులకు త్రాగునీరు, అల్పాహారాలను ఏర్పాటు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా భక్తులకు త్రాగునీరు, మజ్జిగను అందిస్తున్నాయి.

గిరి ప్రదక్షిణకు ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ పూర్తయిన అనంతరం వీరంతా స్వామివారిని దర్శించుకుంటారు. మరోవైపు పౌర్ణమి సందర్భంగా.. సత్యనారాయణ స్వామి ఆలయంలో నేడు వ్రతాలు చేసేందుకు, స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మరోవైపు సింహాచలం అప్పన్న దేవస్థానం వద్ద కూడా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అరుణాచలంలోనూ నేడు గిరి ప్రదక్షిణ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed