వామ్మో.. ఈ హైవే రోడ్డు ఒక్కసారిగా ఎలా కుంగిందో చూడండి.. గాల్లోకి ఎగిరిన కారు(వీడియో వైరల్)

by Jakkula Mamatha |
వామ్మో.. ఈ హైవే రోడ్డు ఒక్కసారిగా ఎలా కుంగిందో చూడండి.. గాల్లోకి ఎగిరిన కారు(వీడియో వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: నేషనల్ హైవే పై నిరంతరం వాహనాలు వెళ్తుంటాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ హైవే రోడ్‌పై వాహనాలన్నీ చాలా వేగంగా వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. రెప్పపాటు వ్యవధిలోనే రోడ్‌లోని కొంత భాగం కూలిపోయింది. ఈ క్రమంలో అక్కడ భారీగా గుంత ఏర్పడింది. అయితే ఇది గమనించని అటుగా వస్తున్న వాహనాలు ఆ గుంతలో పడిపోయాయి.

ఈ షాకింగ్ ఘటన సౌత్ కొరియాలోని గ్యాంగ్ డాంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని హైవే రోడ్డుపై ఉన్నట్టుండి భారీ సింక్‌హోల్ ఏర్పడింది. దీంతో రోడ్డు కింది భాగంలో ఉన్న వాటర్ పంపులు లీక్ కావడంతో.. ఒక్కసారిగా నీళ్లు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. అటుగా వెళ్తున్న కారు గాల్లోకి ఎగరగా మరో బైక్ వ్యక్తితో సహా అందులో పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యలు చేపట్టగా బైక్ మాత్రమే లభించింది.

దాదాపు 12 గంటల నిరీక్షణ తర్వాత అతని మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడం.. పలు వాహనాలు ఆ భారీ గోతిలో పడి పోవడం చూసి వామ్మో అంటున్నారు. అదే సమయంలో గుంతలో నుంచి భారీగా నీళ్లు రావడం చూసి షాక్ అవుతున్నారు.

Next Story

Most Viewed