Padmanabha Reddy: తక్షణ ట్రైబ్యునల్ నియామకాలు చేపట్టండి.. సీఎంకు పద్మనాభరెడ్డి లేఖ

by Prasad Jukanti |
Padmanabha Reddy: తక్షణ ట్రైబ్యునల్ నియామకాలు చేపట్టండి.. సీఎంకు పద్మనాభరెడ్డి లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో తక్షణమే మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఛైర్మన్, సభ్యులను నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (Forum for Good Governance) అధ్యక్షుడు పద్మనాభరెడ్డి (Padmanabha Reddy) సీఎం రేవంత్ (CM Revanth Reddy) రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎంకు లేఖ రాశారు. అక్రమ కట్టడాల నిరోధానికి మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ లేఖలో పేర్కొన్నారు. 2016 లో ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు నియామకాలు జరపలేదని ఈ విషయంలో హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. 8 ఏళ్ల క్రితమే ట్రైబ్యునల్ లో నియామకాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ స్థాయిలో అక్రమ నిర్మాణాలు వెలిసేవి కావన్నారు. కొంత మంది బిల్డర్లు అక్రమ కట్టడాలు చేపట్టి అమాయకులకు విక్రయిస్తున్నారని దీని వల్ల సామాన్యులు మోసపోతున్నారన్నారు.

Advertisement

Next Story