Viral: పార్లమెంట్‌లో వినూత్న నిరసన.. బిల్లుకు వ్యతిరేకంగా డాన్స్ చేస్తూ ఆందోళన

by Ramesh Goud |
Viral: పార్లమెంట్‌లో వినూత్న నిరసన.. బిల్లుకు వ్యతిరేకంగా డాన్స్ చేస్తూ ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: న్యూజిలాండ్ పార్లమెంట్‌(New Zealand Parliament)లో ఎంపీలు(MPs) ప్రభుత్వం(Government)పై తమ నిరసనను(Protest) వినూత్నంగా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. న్యూజిలాండ్ లో ట్రీటీ ప్రిన్సిపల్స్ అనే బిల్లును అధికార పక్ష సభ్యులు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును పార్లమెంట్ లో పాస్ కాకుండా ఉండేందుకు ప్రతిపక్ష సభ్యులు డ్యాన్స్ చేస్తూ నిరసన తెలిపారు. అయోటేరోవా(Aotearoa MP) కు చెందిన 22 సంవత్సరాల అతి పిన్న వయస్సురాలైన ఎంపీ యో హనా-రౌహితీ కరేరికి మైపి-క్లార్క్(Hana-Rauhiti Kareki Maipi-Clark) అనే యువతి సభలో బిల్లును చించేసి మావోరి సంప్రదాయ నృత్యం(Traditional Maori Dance) చేయడం ప్రారంభించింది. దీంతో ఆమెను అనుసరిస్తూ.. ప్రతిపక్ష సభ్యులు అందరూ ఇదే రీతిలో డ్యాన్స్ చేసి బిల్లు పాస్ కావద్దని తమ ఆందోళనను వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ పార్లమెంట్ ను సస్సెండ్ చేశారు. అయితే ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story