Pawan Kalyan : ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య, కూతురు

by Y. Venkata Narasimha Reddy |
Pawan Kalyan : ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య, కూతురు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత.. సీనియర్ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai), కూతురు ఆద్య(Adya)లు కాశీ పర్యటనలో ఆటోలో ప్రయాణించడం వైరల్ గా మారింది. ఈ వీడియోను స్వయంగా రేణు దేశాయ్ ఇన్ స్టాలో పోస్టు చేశారు. తండ్రి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం...క్రేజి స్టార్ హీరో అయినప్పటికి సాధారణ లైఫ్ ను కొనసాగించడానికే ఆద్య ఎక్కువగా ఇష్టపడటం తరుచు కనిపిస్తుంటుంది. తల్లితో కలిసి కాశీలో ఆద్య ఆటోలో ప్రయాణించిన వీడియో చూసిన వారి నిరాడంబరతను అభినందిస్తున్నారు.

తండ్రి పవన్ కల్యాణ్ తో అప్పుడప్పుడు చేసిన ప్రయాణాల్లోనూ ఆద్య హడావుడి చేయకుండా హుందాగా ఉంటుండటం అందరికి తెలిసిందే. అటు పవన్ కొడుకు అకిరా కూడా అదే తరహా జీవన శైలీని కొనసాగిస్తున్నాడు. తల్లి రేణుదేశాయ్ ఆద్య, అకిరాలను ఆడంబరాలు, విలాసాలకు అతీతంగా వారిని సాధారణ జీవన శైలీలో పెంచుతున్న తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed