- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Donald Trump: భారత్ విషయంలో పెద్దగా మార్పు ఏమీ ఉండదు.. ట్రంప్ మాజీ సహాయకురాలు కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా(US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, ఈసారి ట్రంప్ పాలనలో కూడా భారత్ విషయంలో పెద్దగా మార్పు ఉండదని ఆయన ఒకప్పటి సహాయకురాలు లీసా కర్టిస్(Lisa Curtis) పేర్కొన్నారు. ట్రంప్ గత పాలనలో అసంపూర్తిగా ఉన్న అంశాల నుంచి ఈసారి రెండోవిడత మొదలవుతుందని లీసా వెల్లడించారు. వీటిలోనే సుంకాలు, రష్యా నుంచి ఆయుధాల కొనుగోళ్లు, ఇరాన్ నుంచి చమురు దిగుమతి వంటివి కీలకపాత్ర పోషించనున్నట్లు తెలిపారు. ‘‘ఆయన అసంపూర్తిగా వదిలివెళ్లిన అంశాల నుంచి ఈసారి మొదలుపెడతారు కావొచ్చు. భారత్ విషయంలో ట్రంప్‌నకు సానుకూల దృక్పథం ఉంది. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతోందని భావిస్తున్నా. ట్రంప్ గత పాలనలోనే భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం అయ్యాయి. చైనా వల్ల పొంచి ఉన్న ముప్పు వీటిని మరింత ముందుకు నడిపింది. హూస్టన్‌లో 50 వేల మంది అమెరికన్లను ఉద్దేశించి మోడీ ప్రసంగించడాన్ని చూశాం.. అహ్మదాబాద్‌లో లక్ష మందిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించడాన్ని వీక్షించాం. వారి మధ్య ఉన్న స్నేహం చాలా పురోగతి సాధించింది. చాలావరకు టెక్నాలజీ నియంత్రణ ఆంక్షలను భారత్‌పై నుంచి తొలగించారు. సాయుధ డ్రోన్ల టెక్నాలజీ భారత్ కు లభించింది. ఇప్పుడు 31 సీగార్డియన్ ప్రిడేటర్లను కొనుగోలు చేస్తోంది. రక్షణ, భద్రత విషయంలోనే కాదు.. పరస్పర విశ్వాసం, నమ్మకంలోను పురోగతి సాధించింది’’ అని పేర్కొన్నారు.
ముందున్న సవాళ్లు ఇవే..
ట్రంప్ నుంచి భారత్‌కు కేవలం లాభాలే కాదు.. సమస్యలూ ఉన్నాయని లీసా అన్నారు. ‘‘కొన్ని సవాళ్లు కూడా తప్పవు. భారత్ సుంకాలపై ట్రంప్ ట్వీట్ చేసినప్పుడే సమస్య మొదలైంది. అమెరికా కంపెనీలకు భారత మార్కెట్లో మరిన్ని అవకాశాలు రావాలని ఆయన కోరుకుంటారు. ఆయన ప్రతి భేటీకి ముందు ఏదో ఒక ట్వీట్ చేస్తుంటారు. ట్రంప్ బేరమాడటానికి వాడే టెక్నిక్ అది. ఆయన చాలా దేశాల విషయంలో ఇలానే చేశారు. ఇదే భారత్‌తో కొంత ఇబ్బందికర అంశంగా మారుతుంది. ఇలాంటివే జరుగుతాయని భావిస్తున్నా. ట్రంప్ స్టైల్ ని పాటించేందుకు ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలి. ఆయనది పూర్తిగా ఇచ్చిపుచ్చుకొనే మనస్తత్వం. అమెరికన్ల కోసం ఏదో మంచి ఒప్పందం చేయాలని ప్రయత్నిస్తారు’’ అని వెల్లడించారు. చైనాను ఎదుర్కొనే అంశంలో ఇరుపక్షాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని లీసా తెలిపారు.