- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Corporation chairmens : ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీఆర్ఎస్ కుట్ర : కార్పొరేషన్ల చైర్మన్ల ఫైర్
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)నాయకత్వాన్ని అస్థిరపరచాలని బీఆర్ఎస్ (Brs) పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి (Patel Ramesh Reddy), రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి (MalReddy Ram Reddy)ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ (Jaipal) లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్ లో వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు. పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల లగచర్ల దాడి పరిణామాలు చూసిన ప్రజలు ప్రతిపక్షం ఇంకా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది అనుకుంటున్నారన్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి ప్రభుత్వాన్ని అస్తిరపరుచాలని చూస్తున్నారని ఆరోపించారు. లగచర్ల ఘటనలో కేసీఆర్, కేటీఆర్ ఎవ్వరూ ఉన్న చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వంకు మాత్రమే దక్కుతుందని, జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం కుల గణన చేపడుతుందని గుర్తు చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ముందుకెలుతున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి రైతులను రెచ్చగొట్టి దాడులు చేయించారని ఆరోపించారు. అధికారులను చంపే ప్రయత్నం చేయించారన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు కేసీఆర్ ప్రభుత్వం సరైన నష్టపరిహారం ఇవ్వని విషయం మరిచిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇటువంటి దాడులు చేస్తే.. ప్రాజెక్టులు కట్టేవారా అని ప్రశ్నించారు. రైతులకు బేడీలు వేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. అధికారం పోయాక.. కేటీఆర్ కి మతిభ్రమించిందన్నారు. కేటీఆర్ ఫాం హౌస్ లో డ్రగ్స్ తీసుకొని సినిమా వాళ్ళతో ఎంజాయ్ చేసింది అందరికి తెలుసన్నారు. కేటీఆర్ కి ఇంకా అధికార దాహం.. పిచ్చి పోలేదని, కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చి లగచర్ల దాడికి ఉసిగొల్పాడని, సురేష్ కి అసలు భూమి లేనే లేదని రమేశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. దాడులు మానుకోకపోతే.. ప్రజలు సహించరన్నారు.
రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ పదేళ్లలో మేము ఇటువంటి దాడులు చేయలేదని, ప్రతిపక్షంలో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేశామన్నారు. బీఆర్ఎస్ పాలకులు పథకాల పేరుతో దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు.. ప్రభుత్వ భూములు అమ్ముకున్నారన్నారు. జలే కేటీఆర్,హరీష్ రావు లకు బుద్ధి చెబుతారన్నారు.
ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ మాట్లాడుతూ అధికారుల మీద కిరాయి గుండాలతో బీఆర్ఎస్ నేతలు దాడి చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పోవాలంటే ఇండస్ట్రీస్ రావాలని, భూములు ఇవ్వకపోతే ఇండస్ట్రీస్ ఎలా వస్తాయని ప్రశ్నించారు. రైతుల పట్ల మొసలి ప్రేమ చూపుతున్న బీఆర్ఎస్ నాయకులు ధరణి భూములు ఎలా కొల్లగొట్టారో తెలుసన్నారు. ఎప్పుడెప్పుడు అధికార పీఠంలో కూర్చోవాలన్నట్లుగా కేటీఆర్ ఆశ పడుతున్నారని, వచ్చే ఐదేళ్లు కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారన్నారు. పదేళ్ల పాలనలో అనేక తప్పులు చేసిన కేటీఆర్ ఏం పిక్కుంటావో పిక్కో అంటున్నాడని, మరి రేవంత్ రెడ్డిది ఏం పిక్కుంటారో పిక్కొండి చూద్దామని సవాల్ చేశారు.