- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యే అయినా.. ఆమెతో శృంగారం అత్యాచారమే : హైకోర్టు సంచలన తీర్పు
దిశ, వెబ్ డెస్క్: భార్యతో శృంగారం చేసినా.. ఆమె మైనర్ అయితే అది అత్యాచారమే అవుతుందని బాంబే హైకోర్టు (Bombay High Court) సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి కిందికోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను కోర్టు సమర్థించింది. అతనికి చట్టం నుంచి ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితుడి తన భార్య పెట్టిన రేప్ కేసును సవాల్ చేస్తూ బాంబే కోర్టును ఆశ్రయించగా.. నాగ్ పూర్ బెంచ్ (Nagpur Bench) ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్ల లోపు అమ్మాయిని పెళ్లాడి, కాపురం చేస్తే.. అది రేప్ అవుతుందని స్పష్టం చేసింది.
కేసు వివరాల్లోకి వెళ్తే.. ఎంహెచ్ వార్థాలో (MH Wardha) బాలిక తన సిస్టర్స్, తండ్రితో కలిసి.. నిందితుడికి ఎదురింటిలోనే ఉండేది. మూడు, నాలుగేళ్లు వీరి మధ్య రొమాంటిక్ రిలేషిన్ షిప్ (Romantic Relationship) కొనసాగింది. కొన్నాళ్లకు వృత్తిరీత్యా వాళ్లు మరో ప్రాంతానికి వెళ్లగా.. నిందితుడు ఆమెను పికప్, డ్రాపింగ్ చేసేవాడు. ఈ క్రమంలోనే బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా నలుగురికి మాత్రమే తెలిసేలా.. ఓ గదిలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ గర్భం తన వల్ల వచ్చింది కాదని అబార్షన్ చేయించుకోవాలని ఫోర్స్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో.. బాధితురాలు అతనిపై 2019 మే లో రేప్ కేసు పెట్టింది. ఈ కేసులో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించడంతో.. నిందితుడు తన లాయర్ తో కలిసి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. కేసును పరిశీలించిన జస్టిస్ సనప్.. (Justice Sanap) బాధితురాలి తరఫు న్యాయవాది.. ఆమెపై లైంగికదాడి జరిగినపుడు వయసు 18 సంవత్సరాల లోపేనని రుజువు చేయడంతో ఇది రేప్ కేసు కిందికే వస్తుందని తెలిపారు. బాధితురాలికి ఇష్టం ఉండి కలిసినా, ఇష్టం లేకుండా కలిసినా అది రేప్ కేసే అవుతుందని స్పష్టం చేశారు. కాగా.. డీఎన్ఏ పరీక్షల్లో (DNA Test) బాధితురాలు జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి అతనేనని తేలింది.