- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంపెనీ రూల్స్.. ఆఫీసులో ఇతరులతో స్నేహం చేస్తే కఠిన చర్యలు ఫొటో వైరల్
దిశ, వెబ్ డెస్క్: స్నేహం ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో మొదలవుతుందో ఎవ్వరికీ తెలియదు. అన్ని బంధాల కన్నా స్నేహబంధం గొప్పదని చాలా మంది చెబుతుంటారు. అయితే అన్నీ రంగాల్లో కూడా స్నేహం చేయడం వల్ల కమ్యూనికేట్ అయితేనే పని సక్రమంగా జరుగుతుందని కొన్ని సంస్థలు భావించి అందరూ స్నేహ పూర్వకంగా మెలగాలని ఉద్యోగులకు చెబుతుంటారు. తాజాగా, ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఇతరులతో స్నేహం చేయకూడదని ఓ నోటీస్ బోర్డ్ పెట్టారు. ‘‘ఇది మీ పని. పని సమయంలో ఇతర విషయాల గురించి చర్చించి పని సమయాన్ని వృధా చేయకూడదు. పని వేళల్లో ఇతరులతో స్నేహం చేయవద్దు. పని పూర్తయిన తర్వాత ఫోన్ నంబర్‌లను ఇచ్చిపుచ్చుకోండి. సమావేశాన్ని నిర్వహించండి. ఒక సహోద్యోగి కంపెనీ సమయంలో ఇతర విషయాల గురించి మాట్లాడితే కంపెనీ పని మీ డే కేర్ సెంటర్ కాదు అని చెప్పండి’’ అంటూ ఓ బోర్డు పెట్టారు. ప్రస్తుతం ఈ నోటీస్ బోర్డ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
- Tags
- Company rules