‘అదిరా కుమారి ఆంటీ రేంజ్ అంటే’.. ఏకంగా సీఎం దిగొచ్చాడుగా.. (Meme Of The Day)

by Anjali |   ( Updated:2024-01-31 14:50:52.0  )
‘అదిరా కుమారి ఆంటీ రేంజ్ అంటే’.. ఏకంగా సీఎం దిగొచ్చాడుగా.. (Meme Of The Day)
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కుమారి ఆంటీ పేరు మోత మోగుతుంది. ఈ ఆంటీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో సాఫ్ట్ వేర్ కంపెనీల మధ్య ఫుడ్ సెంటర్ పెట్టి నడిపిస్తుంది. తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఫుడ్‌తో పాటు రుచికరంగా అందించడమే ఈమె విషేశం. దీంతో ఈమె వద్దకు భారీ సంఖ్యలో భోజనం కోసం ఎగబడటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ అధికారులు కుమారి ఆంటీపై సీరియస్ అయ్యారు. వెంటనే ఇక్కడి నుంచి ఫుడ్ సెంటర్‌ను తీసేయాలని పట్టుబట్టారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి.. కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ తొలగించొద్దని యథావిధిగా సాయి కుమారి ఫుడ్ సెంటర్ కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీఎం కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ వద్దకొచ్చి.. భోజనం కూడా చేస్తానని అనడంతో నెటిజన్లు సీఎంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దీనిపై మీమర్స్ ఓ మీమ్ వేసుకున్నారు. ‘అది రా కుమారి ఆంటీ రేంజ్ అంటే ఏకంగా సీఎం దిగొచ్చాడుగా’’ అంటూ కుమారి ఆంటీ, రేవంత్ రెడ్డి ఫొటోకు.. రజనీకాంత్ ఫొటో జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed