Delhi Pollution: ప్రమాదకరంగా ఢిల్లీ వాయుకాలుష్యం.. జీఆర్ఏపీ-4 అమలు

by Mahesh Kanagandla |
Delhi Pollution: ప్రమాదకరంగా ఢిల్లీ వాయుకాలుష్యం.. జీఆర్ఏపీ-4 అమలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ వాయుకాలుష్యం(Delhi Pollution) ప్రమాదకరస్థాయికి దిగజారింది. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 457కు పెరిగింది. ఇది సివియర్ ప్లస్ కేటగిరీలోకి వస్తుంది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌(GRAP-4)ను ప్రభుత్వం అమలు చేయాల్సి వచ్చింది. ఈ యాక్షన్ ప్లాన్ కింద పలు సేవలపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఢిల్లీలో స్కూల్స్, ఆఫీసులకు సంబంధించి అడ్జస్ట్‌మెంట్లు అమల్లోకి వచ్చాయి. 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మినహా స్కూల్ స్టూడెంట్లు అందరికీ ఆన్‌లైన్ క్లాసు(Online Classes)ల్లో బోధన జరగనుంది. ఎన్‌సీఆర్ పరిధిలోని ఆఫీసుల్లో 50 శాతం వర్క్ ఫ్రమ్ హోం(Work From Home) అమలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఢిల్లీలో బీఎస్-4, అంతకంటే తక్కువ ర్యాంక్ కింద నమోదైన మీడియం, హెవి గూడ్స్ డీజిల్ రన్ వాహనాలపై నిషేధం. అత్యవసర వస్తువులు తీసుకెళ్లే వాహనాలకు మినహాయింపు ఉంటుంది. ఢిల్లీ వెలుపలి నుంచి వచ్చే కమర్షియల్ సీఎన్‌జీ, బీఎస్-6 డీజిల్ వాహనాలకే అనుమతి ఉంటుంది. ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ లేదా బీఎస్-6 డీజిల్ ట్రక్కులకు.. అదీ అత్యవసర వస్తువులను తీసుకువచ్చేవాటికే అనుమతి ఉంది. ఏక్యూఐ 450కు మించితే సివియర్ ప్లస్ అంటారు. ఈ స్థితిలో ఆరోగ్యవంతులు కూడా సమస్యలు తలెత్తవచ్చు. అనారోగుల పరిస్థితి మరింత దారుణంగా మారే ముప్పు ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed