అతిగా బీర్లు తాగుతున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి!

by Gantepaka Srikanth |
అతిగా బీర్లు తాగుతున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం సేవించడం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయిపోయింది. కొందరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకొందరు ఆర్థికపరమైన సమస్యలు, మరికొందరు మిత్రుల అతి బలవంతం వలన మద్యాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీలో వచ్చే కొన్ని అనుకోని సమస్యల వల్ల మద్యానికి బానిసలు కావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని అనేక సినిమాల్లో మనం చూస్తుంటాం. అయితే ఈ మద్యం అలవాటు ఉన్న వాళ్లలో మనం బీర్లు తాగే వారినే ఎక్కువగా చూస్తుంటాం.

విస్కీ, బ్రాందీ, రమ్ వంటి వాటికి అడిక్ట్ అయిన వారి కంటే బీర్లు తాగే వారిని దోమలు ఎక్కువగా కుడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని ఆసుపత్రి పాలవుతున్నారని అంటున్నారు. దీనిని జపాన్‌లోని టొయామా యూనివర్సిటీ బయోడిఫెన్స్ మెడిసిన్ విభాగం గుర్తించింది. ఈ అధ్యయనం ప్రకారం బీర్ తాగేవారిని దోమలు ఎక్కువగా కుడతాయని తేలింది. బీర్లు తాగడం వల్ల పెరిగిన శరీర ఉష్ణోగ్రతతో పాటు చెమట, వారు విడుదల చేసే CO2 దోమలను ఆకర్షిస్తాయని వెల్లడైంది. దీంతో మిగిలిన ఆల్కహాల్ ప్రియుల కంటే బీర్లు తాగే వారు అతి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు.

Advertisement

Next Story