- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలీస్ ఆఫీసర్‌కు ‘హారతి’ నిరసన.. ఎందుకో తెలుసా?
దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన ఓ కుటుంబం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఓ పోలీస్ ఆఫీసర్‌కు హారతి ఇచ్చి నిరసన తెలిపారు. ఓ కేసులో విషయంలో నెల రోజులుగా ఆ కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నది. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయడం లేదని నిరాశతో పోలీసు ఆఫీసర్‌కు హారతి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు బోట్టు, దండలు, హారతి, కొబ్బరికాయతో ఓ మహిళ, ఆమె భర్త, కుమార్తెతో ఓ ఫ్యామిలీ కలిసి వచ్చారు. పోలీసుకు తన బాధ్యత గుర్తుచేయాలని స్టేషన్ ఆఫీసర్‌కు హారతి ఇచ్చారు. దీంతో ఆ పోలీస్ ఆఫీసర్ తలదించుకునే పరిస్థితి ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మంచిపనిచేశారని నెటిజన్లు ఆ కుటుంబాన్ని అభినందిస్తున్నారు. ఏ అధికారి అయిన తన డ్యూటీని సక్రమంగా నిర్వహించకపోతే అలాగే చేయాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.