Ravi Teja: ‘RT75’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. టైటిల్ ఏంటో తెలిస్తే వావ్ అనాల్సిందే?

by Hamsa |
Ravi Teja: ‘RT75’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. టైటిల్ ఏంటో తెలిస్తే వావ్ అనాల్సిందే?
X

దిశ, సినిమా: మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja), శ్రీలీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘’. ఈ చిత్రంతో ‘సామజవరగమన’ సినిమాకు రచయితగా చేసిన భాను బోగవరపు (Bhanu Bogavarapu)దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అయితే RT75 మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో మే 9న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో.. తాజాగా, మేకర్స్ రవితేజ(Ravi Teja) అభిమానులకు దీపావళి ట్రీట్ ఇస్తూ RT75 ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘మాస్ జాతర.. మనదే ఇదంతా’ అనే టైటిల్ పెట్టారు. అలాగే రవితేజ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇందులో మాస్ మహారాజా చేతిలో గంట పట్టుకుని మాస్ లుక్‌తో కనిపించారు. ప్రజెంట్ రవితేజ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన ఫ్యాన్స్ వావ్ అంటూ మోత మోగిపోవడం ఖాయమని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed