Congress Vs BRS: రాష్ట్రంలో డ్రగ్స్ టెస్ట్ వార్.. కౌశిక్ రెడ్డి యూటర్న్!

by Ramesh Goud |
Congress Vs BRS: రాష్ట్రంలో డ్రగ్స్ టెస్ట్ వార్.. కౌశిక్ రెడ్డి యూటర్న్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జన్వాడ ఫాంహౌజ్(Janwada Form House) కేసు ఘటన అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య యుద్దం(War)లా మారింది. గ్రడ్స్ టెస్ట్(Drug Test) చేయించుకోవాలని కాంగ్రెస్(Congress) బీఆర్ఎస్(BRS) నేతలు సవాళ్లు(Challenges) విసురుకుంటున్నారు. మంగళవారం ఫాంహౌజ్ కేసుపై రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్(MP Anilkumar Yadav), ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్(MLC Balmoor Venkat) లు బీఆర్ఎస్ నాయకులకు డ్రగ్స్ టెస్ట్ చేయించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) మాట్లాడుతూ.. డ్రగ్స్ టెస్ట్ కు తాను సిద్దమని, ఎక్కడికి రావాలో కాంగ్రెస్ నేతలు చెప్పాలని సవాల్ విసిరారు. దీంతో ఈ సవాల్ ను స్వీకరించిన ఎంపీ అనిల్, ఎమ్మెల్సీ వెంకట్ లు ఏఐజీ ఆసుపత్రి(AIG Hospital)కి వెళ్లి కౌశిక్ రెడ్డి కోసం రెండు గంటల పాటు ఎదురు చూశారు.

దీనిపై కౌశిక్ రెడ్డి సమాచారం లేకుండా వెళ్లారని, సవాల్ విసిరినప్పుడు దానికి కట్టుబడి ఉండాలని ఇప్పుడైన డెట్, టైం చెబితే ఎక్కడికే రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పారు. దీంతో ఇవాళ ఉదయం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ లు హైదర్ గూడ(Hydarguda)లోని అపోలో ఆసుపత్రి(Appolo Hospital)కి వెళ్లి డ్రగ్స్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సవాల్ విసిరన కౌశిక్ రెడ్డి, ఆయన బాస్ పత్తా లేరని ఎద్దేవా చేశారు. అంతేగాక కేటీఆర్(KTRBRS) డ్రగ్స్ తీసుకుంటాడనే అనుమానం ఉందని, డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఎమ్మెల్సీ అన్నారు. దీనిపై మరో మారు పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ.. డ్రగ్స్ టెస్ట్ కు నేను రెఢీ అని ఎక్కడికి రావాలో చెప్పాలని, తనకు చెప్పకుండా ఆసుపత్రులకు వెళుతున్నారని అన్నారు. అలాగే తన పంచాయితీ అనిల్ యాదవ్‌తో కాదని, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో అన్నారు. దీంతో కౌశిక్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Advertisement

Next Story