- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Wyra :అడ్డదారిలో ఉద్యోగుల నియామకం.. వైరా మున్సిపాలిటీలో అధికారుల లీలలు
దిశ, వైరా : నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన వైరా మున్సిపాలిటీలో అడ్డదారిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదమవుతుంది. ఈ మున్సిపాలిటీలో జీవో నెంబర్ 14 నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ప్రైవేటు వ్యక్తులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కల్పించారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు విమర్శలు వినవస్తున్నాయి. ఒక్కో ఉద్యోగానికి రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు అందిన కాడికి అక్రమంగా వసూలు చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలో అధికారాలతో పాటు పాలకవర్గంలోని కొంత మంది కీలకపాత్ర పోషించారు. అడ్డదారిలో వైరా మున్సిపాలిటీ అధికారులు ఉద్యోగాల కల్పన లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కనీసం సీడీఎంఏ అనుమతి లేకుండా తమ ఇష్టానుసారంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికే అక్రమంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కల్పనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల ఆధారంగా అధికారులు విచారణ చేసే అవకాశం ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా 8 మందికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు..
(Wyra Municipality) వైరా మున్సిపాలిటీలో జీవో నెంబర్ 14, సీడీఎంఏ నిబంధనలకు విరుద్ధంగా సుమారు 8 మంది ప్రైవేటు వ్యక్తులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వైరా మున్సిపాలిటీలో ప్రస్తుతం జీవో నెంబర్ 14 కింద సుమారు 64 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే వీరిలో సుమారు 56 మంది గత గ్రామపంచాయతీ కాలం నుంచి పనిచేసే వారు ఉన్నట్లు తెలుస్తోంది. వైరా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత గత రెండు, మూడు సంవత్సరాల్లో అడ్డదారిలో 8 మందికి జీవో నెంబర్ 14 కింద ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఒక్కో ఉద్యోగికి జీవో నెంబర్ 14 కింద 15 వేల నుంచి 16 వేల రూపాయల వేతనం చెల్లిస్తున్నారు. నిబంధన ప్రకారం మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకోవాలంటే సీడీఎంఎ అనుమతిని తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. అయితే తాము మున్సిపాలిటీ పాలకవర్గ తీర్మానంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నామని అధికారులు చెప్పడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఒక్క ఉద్యోగి వద్ద 5 నుంచి 8 లక్షల వరకు అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
దొడ్డి దారిన విధుల్లో చేరిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధి నిర్వహణలో తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకోవడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే వైరా మున్సిపాలిటీ లో జరిగిన అనేక అవినీతి అవకతవకలపై వైరా మున్సిపాలిటీ ప్రజల పేరుతో ఉన్నతాధికారులకు భారీ స్థాయిలో ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులో అక్రమంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారనే అంశాన్ని కూడా పొందుపరిచారు. అక్రమంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం చేపట్టినప్పటికీ కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమకు అందిన ఫిర్యాదులకు అనుగుణంగా అక్రమంగా విధుల్లో చేరిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలని మున్సిపాలిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.