- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాయ్ నాన్న.. ఈ తండ్రి ప్రేమ ముందు అన్నీ బలాదూరే... (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : తండ్రి ప్రేమ ముందు అన్ని బలాదూర్ అనే మాట కొన్ని సంఘటనలు చూసినప్పుడు నిజమే అనిసిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రోడ్డుపై టూవీలర్‌లో ప్రయాణిస్తున్న తండ్రి కొడుకులు ఉన్నారు. అందులో వైరల్ అవ్వడానికి ఏముంది అనుకుంటున్నారా ..? ఆ బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రి కొడుకులు చలిలో భారీగా ఈదురు గాలుల మధ్య ప్రయాణిస్తున్నారు. ఒక పక్క మంచు.. మరో పక్క జోరుగాలి వీస్తుండగా ఆ తండ్రి తన కొడుకును వెనకాల ఉంచి, మంచు పడకుండా శాలువా కప్పి తీసుకెళ్తున్నాడు. అంతే గాక ఒక చేతితో తన కొడుకు కింద పడకుండా పట్టుకొని, మరో చేతితో బండి నడుతూ జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు.
దీన్ని కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన కెమెరాలో బందించి తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ దృశ్యం చూపరుల మనుసును కలిచి వేస్తుంది. అంతగా తన కొడుకు పై ఉన్న మమకారాన్ని చూపించారు ఆ తండ్రి. వీడియోలో కనిపిస్తున్న తండ్రి అనే కాదు.. ప్రపంచంలోని ఏ తల్లిదండ్రులు అయిన తాము కన్న బిడ్డలపై అంతే ప్రేమ చూపిస్తారు అంటున్నారు పలువురు నెటిజన్లు. ఏ తండ్రి ప్రేమ అయినా కావల్సిన టైంలో బయటకి వస్తుంది అని, ఆ తండ్రి ప్రేమకు జోహార్లు అని కామెంట్లు పెడుతున్నారు.