TG Govt: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ ఫైల్ సీఎం రేవంత్ వద్దకు వెళ్లడమే ఆలస్యం

by Gantepaka Srikanth |
TG Govt: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ ఫైల్ సీఎం రేవంత్ వద్దకు వెళ్లడమే ఆలస్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఫుడ్ ప్రియుల(Food Lovers)కు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నది. ఆహార క్వాలిటీ పెంచేందుకు ఇక నుంచి హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ విధానాలను తీసుకురావాలని ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ ఏఐ) కసరత్తు చేస్తున్న ది. హోటళ్లలోని ఆహారాన్ని నిత్యం తనిఖీ చేస్తూ, నేరుగా ఎఫ్ఎస్ఎస్ ఏఐ రేటింగ్‌లు ఇవ్వనున్నది. అంతేగాక ఆన్‌లైన్‌లో రేటింగ్ ఆధారంగా జాబితానూ పొందుపరచనున్నది. దీని వలన కల్తీ ఆహారానికి చెక్ పెట్టడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఉపయోగపడుతుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు(Food Safety Authorities) చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో తొలుత మొ దలు పెట్టి, సెకండ్ ఫేజ్‌లో జిల్లాలకు ఈ విధానాన్ని తీసుకువెళ్లనున్నారు. అంతేగాక హోటళ్ల రేటింగ్ ప్రత్యక్షంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఆయా యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలూ వెళ్లనున్నాయి. ఈ విధానం అమలుపై ప్రస్తుతం ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ తర్వాత సీఎంకు ఫైల్ వెళ్తుందని ఓ అధికారి తెలిపారు.

జనాభా ప్రతిపాదికన అధికారులు?

హైదరాబాద్ పరిధిలో దాదాపుగా చిన్న, పెద్దవి, కలిపి దాదాపు 74 వేల రెస్టారెంట్లు ఉంటే కేవలం 23 మంది మాత్రమే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. అంటే సుమారు 3500లకు పైగా రె స్టారెంట్లకు ఓ అధికారి ఉన్నట్లు లెక్క. పండుగ లు, సెలవులు తీసివేస్తే, రోజుకు పది చొప్పున తనిఖీలు చేసినా, ఏడాదిలో అన్ని హోటళ్లను త నిఖీ చేయడం కష్టం. పైగా టెంపుళ్లు, హాస్టళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోని క్యాంటీన్లు తదితరవ న్నీ ఎప్పటికప్పుడు చెకింగ్ చేయాల్సి ఉంటుం ది. కానీ ప్రస్తుతం సమర్థవంతంగా తనిఖీలు చే యడం లేదనేది స్వయంగా అధికారులే అంగీక రిస్తున్నారు. దీని వలన ఆహార కల్తీలను అరికట్ట డం సాధ్యం కావడం లేదు. తద్వారా ఫుడ్ పా యిజన్ కేసులు పెరుగుతున్నాయి. ఇక జిల్లాల పరిస్థితైతే మరింత ఆధ్వనంగా మారింది. కనీ సం ఏడాదికి ఒకసారి కూడా చెకింగ్ జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికా రులు, హోటళ్ల యాజమాన్యాలతో కుమ్మక్కై, తనిఖీలు సరిగ్గా నిర్వహించడం లేదనే వాదన వినిపిస్తున్నది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారుల సంఖ్యను పెంచడం వలన హోటళ్లపై స్ట్రిక్ట్‌గా ని ఘా పెట్టవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. సీఎం అప్రూవల్ తర్వాత రిక్రూట్‌మెంట్ జరగనున్నది.

నివేదిక తయారు?

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఎన్ని హోట ల్స్‌ ఉన్నాయి? ఫాస్ట్ ఫుడ్ నుంచి మొదలు పా య సెంటర్ల వరకు అన్నింటినీ లెక్కించనున్నా రు. వాటి ఆధారంగా ఎన్ని హోటళ్లకు ఓ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుందనేది అధికారులు నివేదిక రూపంలో తయారు చేయనున్నారు. వైద్య, ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రభు త్వం ఓ కమిటీని వేయనున్నది. ఈ కమిటీ ఇత ర రాష్ట్రాలు, దేశాల్లోని ఆహార కల్తీపై అధ్యయ నం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్న ది. దేశ వ్యాప్తంగా ముంబై తర్వాత అత్యధిక వ్యాపారం హైదరాబాద్‌లోనే జరుగుతుందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్​ఇండి యా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆహా ర కల్తీలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నది.

స్ట్రీట్ వెండర్లకూ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్?

ఇప్పటి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రమే ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకున్నారు. కానీ ఇక నుంచి స్ట్రీట్ వెండర్లూ (బండ్లపై ఫుడ్ విక్రయిం చే) ఎఫ్ఎస్ఎస్ ఏఐ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.100 వరకు ఫీజు పె ట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రతి ఏటా రె న్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తం గా దాదాపు 25 వేలకు పైనే స్ట్రీట్ వెండర్స్ బం డ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటన్నింటినీ రిజిస్ట్రేషన్ చేస్తూ, ఎఫ్ఎస్ఎస్ ఏఐ సర్టిఫికెట్‌ను ఇవ్వనున్నారు. ‘నెస్టిల్ ఇండియా’ అనే గుర్తింపు కలిగిన సంస్థ ద్వారా స్ట్రీట్ వెండర్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆహార నియమాలు ఎలా పాటించాలి? కష్టమర్లకు ఎలాంటి ఫుడ్‌ను అం దించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే దా దాపు 5 వేల మందికి ట్రైనింగ్ అందించగా, త్వరలో 60 సెషన్స్‌లో మరో 3 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నా రు. ట్రైనింగ్ పొందిన స్ట్రీట్ వెండర్లకు ఎఫ్ఎస్ఎస్ ఏఐ సర్టిఫికెట్‌తో పాటు హైజిన్ కిట్స్‌, ఆప్రాన్స్‌, హెడ్‌ క్యాప్స్‌, గ్లౌజ్‌లు అందజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed