- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Cyber Crime: ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి రూ.2 కోట్లు టోకరా
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) భారీ ఎత్తున ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్ (Whatsaap), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిలువునా దోచేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ (QR Codes), వెబ్ లింకు (Web Links)లతో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లు (Stock Markets), ట్రేడింగ్ (Trading)లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు.
తాజాగా, హైదరాబాద్ (Hyderabad)లోని బాచుపల్లి (Bachupally)కి చెందిన ఓ సాఫ్ట్‌వేరు ఉద్యోగి ఫోన్ నెంబర్ సైబర్ నేరగాళ్లు కేఎస్ఎల్ అఫీషియల్ స్టాక్ (KSL Official Stock) పేరుతో క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. అయితే, ఆ గ్రూప్‌లో తమ వద్ద పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుంది మెసేజ్‌లతో నమ్మబలికారు. అనంతరం కొటక్ ప్రో యాప్ (Kotak Pro Aap) అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వారిని నమ్మిన ఐటీ ఉద్యోగి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి కస్టమర్ కేర్ సూచన మేరకు అందులో 2.29 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాడు.
మొదట బాధితుడికి రూ.1.10 కోట్ల లాభం వచ్చినట్లుగా నమ్మించి మొత్తం.. అకౌంట్ ఉన్న రూ.3.3 కోట్లు విత్ డ్రా చేసుకోవాలంటే ఇంకో రూ.40 లక్షలు కట్టాలని చెప్పారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న సదరు సాఫ్ట్‌వేరు ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) నిందితులు నరేష్ శిందే, సౌరభ్ శిందేలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు అంతా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.