- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చేప పిల్లల పంపిణీలో తప్పుడు లెక్కలు
దిశ నల్లగొండ బ్యూరో: మత్స్య కార్మికుల కు ఉపాధి కల్పించడం కోసం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం గత ప్రభుత్వం తీసుకువచ్చింది. నాటి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లదే హవా కొనసాగింది. ఇప్పుడు కూడా కాంట్రాక్టర్ల రాజ్యమే నడుస్తుంది. పాలకులు మారారు చేపల పంపిణీ లెక్కల్లో తప్పులు జరగకుండా చెరువు పై ఆధారపడ్డ కార్మికులు భావించారు. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది...
చేప పిల్లల పంపిణీ ఇలా
నల్గొండ జిల్లాలో దాదాపు 1000 కి పైగా చెరువులు ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో 964 చెరువుల్లో 35-40mm సైజ్ లో మొత్తం 93. 52 లక్షలు చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 9 రిజర్వాయర్లు, ఏడాది పొడవునా నీళ్లుండే 190 చెరువులలో 80-100 mm సైజు పిల్లలను 2.40 కోట్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం చెరువులలో కలిపి మూడు లక్షలకు పైగా చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం 35--40mm సైజ్ చేప పిల్లలకు 0-56 పైసలు, 80-100 mm సైజ్ చేప పిల్లలకు రూ.1:46 ధరగా నిర్ణయించారు.
ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీ..
జిల్లాలో ఇప్పటివరకు కేవలం 80- 100mm చేప పిల్లల పంపిణీ చేశారు. ఉచిత చేప పిల్లల పంపిణీ మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు సుమారు 21 లక్షలకు పైగా పిల్లలను చెరువుల్లో రిజర్వాయర్లో వదిలారు. అయితే చేప పిల్లలను నీటిలో వదిలేసేటప్పుడు లెక్కించే విధానం తప్పుల తడకగా మారిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలోని మండల పరిధిలో ఉన్న ఓ గ్రామ చెరువులో లక్ష చేప పిల్లలు పోయాల్సి ఉండగా కేవలం 50 వేల పిల్లలు మాత్రమే వదిలినట్టు సమాచారం. అధికారులు, కార్మికుల సాక్షిగా కాంట్రాక్టర్లు 50 శాతం పిల్లలను పోయకుండానే లెక్కలు కొట్టుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బుధవారం నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో సుమారు 13.72లక్షల చేప పిల్లలను వదిలేయాల్సి ఉండగా అందులో కేవలం 50 నుంచి 60 శాతం పిల్లలను వదిలినట్లు తెలిసింది. కార్మికులు అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నా సరే చేప పిల్లలు పంపిణీలో తప్పుడు లెక్కలతో సరఫరా చేయడం కాంట్రాక్టర్లు కు అంద వేసిన చెయ్యి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రిజర్వాయర్లో పోసిన చేప పిల్లలు కూడా నాణ్యతగా లేవని ఆరోపణలు ఉన్నాయి.
వాళ్లంతా కుమ్మక్కు..
"రాజుల సొమ్ము రాళ్లపాళ్లు" అనే విధంగా అధికారులు కాంట్రాక్టర్లు ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారని విమర్శలు ఉన్నాయి కార్మికుల ఉపాధి కోసం చెరువులో పోస్తున్న చేప పిల్లల్లో దోపిడీ పెద్ద ఎత్తున సాగుతుందని సమాచారం. చేప పిల్లల పంపిణీలో అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై చేపలు సరఫరా లో 50- 60 శాతం వరకు మాత్రమే చెరువులలో రిజర్వాయర్లు వదిలేస్తూ ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ చేపల పంపిణీ పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తే అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న అధికారుల అవినీతి కూడా బయటపడే అవకాశం ఉంది. అందుకే జిల్లా పాలనాధికారి దృష్టి సారించాలని కార్మికులు కోరుతున్నారు.