- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరో సంచలనం దిశగా BSNL.. సిమ్ లేకుండానే ఫోన్ కాల్స్..!
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్(BSNL).. మరో సంచలన నిర్ణయం(Sensational decision) దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4G నెట్ వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు అందించడం మొదలుపెట్టింది. దీంతో రెండు నెలల వ్యవధిలోనే లక్షలాది మంది వినియోగదారులను పెంచుకుంది. దీంతో JIO, Airtel వంటి సంస్థలు తమ ప్లాన్ రీఛార్జ్ ధరలను తగ్గించే ఆలోచనలోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా బీఎస్ఎన్ఎల్ మరో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తొంది. త్వరలో సిమ్ లేకుండానే కాల్స్ మెసేజ్‌లు చేసేలా కొత్త టెక్నాలజీని BSNL సంస్థ తయారు చేపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త టెక్నాలజీతో ఫోన్ లో సిమ్ లేకపోయినా నెట్ వర్క్ లేకపోయినా సరే కాల్స్ చేయవచ్చు. దీంతో విపత్తులు, మారుమూల ప్రాంతాల్లో చిక్కుకుపోయిన, అటవీప్రాంతంలో తప్పిపోయినప్పటికి ఈ కొత్త టెక్నాలజీ సాయంతో సేవలు పొందవచ్చని తెలుస్తుంది. ఈ డైరెక్ట్ టూ డివేజ్ టెక్నాలజీ కోసం అమెరికాకు చెందిన వయాశాత్ తో కలిసి దీనిని పరీక్షిస్తున్నట్లు సమాచారం. శాటిలైట్, ప్రాంతీయ మొబైల్ నెట్ వర్క్‌లను లింక్ చేయడం ద్వారా పనిచేయనుంది. దీంతో ఇకపై అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లే సెల్ ఫోన్ టవర్లుగా మారనున్నాయి.