PM Modi: విశాఖలో ప్రధాని పర్యటన.. ఏయూలో బహిరంగ సభ?

by Rani Yarlagadda |
PM Modi: విశాఖలో ప్రధాని పర్యటన.. ఏయూలో బహిరంగ సభ?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) విశాఖకు రానున్నట్లు తెలుస్తోంది. విశాఖలో ఆయన పర్యటన దాదాపు ఖరారైనట్లు సమాచారం. కానీ.. పీఎంఓ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ అఫీషియల్ గా ఉన్న సమాచారం ప్రకారం.. నవంబర్ 29న సాయంత్రం ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ (AU Engineering College) మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే వేదిక నుంచి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ సభకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏయూలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన బీఈ, బీటెక్, బీఆర్క్‌ పరీక్షలను ప్రధాని పర్యటన నేపథ్యంలో నవంబర్‌ 30, డిసెంబర్‌ 2, 3 తేదీలకు వాయిదా వేశారు.

Advertisement

Next Story