ఏఆర్ రెహమాన్ సెన్సేషనల్ ట్వీట్.. వాళ్లందరికీ నోటీసులు ఇస్తానంటూ వార్నింగ్

by Hamsa |
ఏఆర్ రెహమాన్ సెన్సేషనల్ ట్వీట్.. వాళ్లందరికీ నోటీసులు ఇస్తానంటూ వార్నింగ్
X

దిశ, సినిమా: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) ఇటీవల తన భార్య సైరా భాను(Saira Bhanu)తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఆయన విడాకులు తీసుకున్న కొన్ని గంటల్లోనే ఆయన టీమ్‌మెట్ మోహిని దే(Mohini Dey) కూడా తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. ఇక ఆమె పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టించింది. వీరిద్దరి మధ్య రిలేషన్‌(Relationship) ఉందని అందుకే ఒకేసారి విడాకులు తీసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది వీడియోలను యూట్యూబ్‌లో కూడా పెట్టారు.

ఈ క్రమంలోనే ఆయన కొడుకు అవన్నీ అవాస్తవాలని పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చాడు. తాజాగా, ఏఆర్ రెహమాన్(AR Rahman) టీమ్ తప్పుడు ప్రచారం చేసేవారికి సీరియస్ వార్నింగ్(Serious warning) ఇచ్చారు. సోషల్ మీడియా(Social Media)లో ఎక్కడైనా సరే ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని ఏఆర్ రెహమాన్ సూచించినట్లు ఓ ప్రకటనను విడుదల చేశారు. అంతేకాకుండా అభ్యంతన కంటెంట్‌ను 24 గంటల్లోపు తొలగించక పోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ పోస్ట్‌లో 3 పేజీల నోటీసులో 8 హెచ్చరిక పాయింట్లు ఉన్నాయి. ప్రజెంట్ ఏఆర్ రెహమాన్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed