BRS: నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది.. సీఎంపై కేటీఆర్ విమర్శలు

by Ramesh Goud |
BRS: నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది..  సీఎంపై కేటీఆర్ విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) .. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందని, అప్పుడు ఫార్మాసిటీ(Farmacity) అని చెప్పి ఇప్పుడు మాట మారుస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. కొడంగల్(kodangal) లో ఫార్మాసిటీ కాదు.. పారిశ్రామిక కారిడార్(Industrial Corridor) అని సీఎం రేవంత్ రెడ్డి అన్నా మాటలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ముఖ్యమంత్రిపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. అది నోరైతే నిజాలు వస్తాయి.. అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయని, పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని ఆరోపించారు.

అలాగే మీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్(Gezit Notification) కొడంగల్ లో భూసేకరణ ఫార్మా విలేజ్ ల కోసం అని స్పష్టంగా వెల్లడిస్తుందని చెప్పారు. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేశారని, తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొట్టారని దుయ్యబట్టారు. అంతేగాక మీ అన్న తిరుపతి(Thirupati Reddy) లగచర్ల చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా అని, ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా అని నిలదీశారు. ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారని, చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నావని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed