- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Amaran: నితిన్ పాటను తెలుగులో పాడిన శివకార్తికేయన్
దిశ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన తాజా మూవీ 'అమరన్' (Amaran) దీపావళి కానుకగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్షన్ చేశారు.
ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 31 న థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ ఆరు రోజుల్లో రూ.150 కోట్లకు పైగా వసూలు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ కు టాలీవుడ్ హీరో నితిన్ గెస్ట్ గా వచ్చారు. నితిన్ కు చెందిన శ్రేష్ట్ మూవీస్ బ్యానరే 'అమరన్' ను తెలుగులో విడుదల చేసింది.
కాగా, ఈ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్ తెలుగులో పాట పాడి అందర్ని అలరించాడు. శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ''అమరన్' మూవీ చేయడానికి కారణం మా నాన్న. ఆయన ఒక పోలీసాఫీసర్.. నాన్న కూడా డ్యూటీలోనే మరణించారు. సినిమా విడుదలైన రోజూ నుంచి నితిన్ రోజూ ఫోన్ చేసి అప్డేట్స్ చెప్తూనే ఉన్నారు.. " అని తెలిపాడు.