- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మోహన్‌లాల్ ‘తుడరుమ్’ ట్రైలర్ రిలీజ్.. ఇక నేను చెప్పేది మీరంతా వినాలి అంటూ హైప్ పెంచేశాడుగా

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ స్టార్ మోహన్ లాల్(Mohan Lal), దర్శకుడు తరుణ్ మూర్తి(Tharun Moorthi) కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘తుడరుమ్’(Thudarum). ఇందులో మోహన్ లాల్ టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఇక, ఈ సినిమాలో సీనియర్ నటి శోభన(Shobhana) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటివరకు మోహన్ లాల్, శోభన కాంబోలో 55 సినిమాలు రాగా.. ఇది 56వ చిత్రం కావడం విశేషం. అయితే రెజపుత్ర విజువల్ మీడియా సమర్పణలో ఎమ్ రెంజిత్(M Ranjith) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగులో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. క్రైమ్ కామెడీ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్‌ను గమనించినట్లయితే.. స్టార్టింగ్లో ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించిన మోహన్ లాల్ ట్రైలర్ ఎండింగ్‌కు వచ్చేసరికి ‘ఇక నేను చెప్పేది మీరంతా వినాలి’ అంటూ చెప్పే డైలాగ్‌తో వైలెంట్‌గా కనిపించాడు. అలాగే మాస్ సీన్స్, ఫ్యామిలీ సీన్స్ అన్ని సూపర్‌గా అనిపించాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్‌ను చూసేయండి.